![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -710 లో..... పారిజాతం చేసిన ప్లాన్ తనకే రివర్స్ అవుతుంది. అసలు అవుటౌస్ కి తాళం కొన్నదే నేను.. ఒక 'తాళం(కీ)' నా దగ్గర ఉంటుంది. సూరజ్ ఫోన్ చెయ్యగనే వచ్చామని పారిజాతంతో కార్తీక్ చెప్తాడు. అదంతా విని పారిజాతం షాక్ అవుతుంది. ఇవన్నీ తాతతో చెప్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించూ పారు అని కార్తీక్ అనగానే వద్దురా అని పారిజాతం భయపడుతుంది. ఇక నుంచి అవన్నీ మానెయ్ అని పారుకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరు కలిసి సూరజ్ దగ్గరికి వస్తారు.
మేమిద్దరం నీకు స్వీట్ ఇవ్వడానికి వచ్చాము.. అప్పుడే ఇదంతా చూసాం కానీ తాతకి ఒక కథ పారుకి ఒక కథ చెప్పాము.. నువ్వు జాగ్రత్త అని సూరజ్ కి కార్తీక్ చెప్తాడు. సూరజ్ కీ దీప స్వీట్ ఇస్తుంది. థాంక్స్ వదిన అని సూరజ్ అనగానే దీప, కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తారు. నాకు ఎందుకో అలా పిలవాలనిపించింది.. నాకంటూ ఒక బంధం ఉండాలని అలా అన్నానని సూరజ్ అనగానే దీప, కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత దీప ఇంటికి వెళ్లి సూరజ్ వదిన అని పిలిచింది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంది. బావ.. సూరజ్ నన్ను వదిన అని పిలిస్తే బాగనిపించింది. తను ఎప్పుడు మనతో ఉండేలా చెయ్యాలని దీప అనగానే బ్రో అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు.. సడన్ గా వెళ్ళిపోతానంటే ఏం చెయ్యలేమని కార్తీక్ అంటాడు. ముందు తన ఫ్యామిలీ గురించి కనుక్కోమని దీప చెప్తుంది. మరుసటిరోజు తాత ఆఫీస్ కి రమ్మని కాల్ చేసాడని పారుతో జ్యోత్స్న చెప్తుంది. నేను వస్తానే అని పారు అంటుంది. అప్పుడే సూరజ్ స్కూటీతో రెడీగా ఉంటాడు. పది నిమిషాల్లో ఆఫీస్ లో ఉండాలన్నారు.. నేను వెళ్తున్నానని సూరజ్ అనగానే ఒసేయ్ వెళ్ళు త్వరగా అని పారు అంటుంది. దాంతో ఏం చెయ్యలేక సూరజ్ స్కూటీపై జ్యోత్స్న ఎక్కి వెళ్తుంది. దారిలో ఇద్దరి మధ్య మాటలతో యుద్ధం జరుగుతుంది.
ఆ తర్వాత దీప సీఈఓగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు తనకి అందరు వెల్ కమ్ చెప్తారు. అందరికి దీప స్వీట్ ఇస్తుంది. శివన్నారాయణ దగ్గరుండి మరీ సీఈఓ కుర్చీలో కూర్చోబెడతాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గర దీప ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ జ్యోత్స్న తనంతట తనే నిజం ఒప్పుకునేలా చేస్తానని దీపతో కార్తీక్ అంటాడు. ఆ మాటలన్నీ జ్యోత్స్న వింటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప, జ్యోత్స్న సూరజ్, శివన్నారాయణ, పారు అందరు ఒక దగ్గరికి వస్తారు. ఇప్పుడు జ్యోత్స్న తప్పుకి ఏం శిక్షనో అన్నీ పేపర్ లో రాసాను.. కార్తీక్ నువ్వు చదువమని శివన్నారాయణ అంటాడు. ఆఫీస్ కి రోజు రావాలి.. దీపకి అసిస్టెంట్ గా ఉండాలని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |